Header Banner

నిధుల నిలిపివేత.. ట్రంప్‌నకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ! ఎటువంటి చర్యలు తీసుకోవాలో..

  Thu Mar 06, 2025 10:09        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అందుతున్న నిధులను ట్రంప్ సర్కార్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే విధిస్తూ ఇటీవల ట్రైయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను పొడిగించడానికి గడువు ఇప్పటికే ముగిసినందున ఎటువంటి చర్యలు తీసుకోవాలో ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని వైట్‌హౌస్‌కు సూచించింది. ఈ తీర్పుతో నిధుల విడుదలకు అనుమతి లభించినప్పటికీ దీనికి సరైన కాలపరిమితిని నిర్ణయించలేదు. దీంతో ట్రంప్ సర్కార్ దిగువ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. కాగా, వివిధ దేశాల్లోని పలు సంస్థలకు ఆర్ధిక సాయం అందించే యూఎస్ ఎయిడ్ (యూఎస్ఏఐడీ) సంస్థ ద్వారా అందుతున్న నిధులను స్తంభింపజేస్తూ ట్రంప్ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఎన్జీవోలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఫెడరల్ జడ్జి అమీర్ అలీ ట్రంప్ సర్కార్ ఉత్తర్వులపై తాత్కాలికంగా స్టే ఇచ్చారు. తన ఉత్తర్వులు అమలు చేస్తున్నదీ లేనిదీ ఐదు రోజుల్లో తెలపాలని ట్రంప్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జడ్జి అమీర్ ఆలీ ఇచ్చిన ఉత్తర్వులను 5-4 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం సమర్ధించింది.  

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence